Vijay Sethupathi: నా కెరీర్ ముగిసిపోయిందన్నారు..! 1 y ago
హీరో, విలన్.. పాత్ర ఏదైనా సరే తన విలక్షణ నటనతో నటుడు విజయ్ సేతుపతి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన ''మహారాజ' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సేతుపతి అవార్డు అందుకున్నారు. ఈ వేడుకలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మహారాజ' కంటే ముందు నేను నటించిన చాలా సినిమాలు సరిగ్గా ఆడలేదన్నారు. తన కెరీర్ ముగిసిపోయిందని కామెంట్స్ చేశారని విజయ్ చెప్పారు. ప్రస్తుతం 'ట్రైన్'తో పాటు మరో సినిమాలోనూ యాక్ట్ చేస్తున్నారు.